ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు డిమాండ్ చేస్తున్నారని విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అన్నారు. జగనుకు ప్రజాస్వామ్యం అంటే ఎలర్జీ అని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన మొదటి పర్యటనలో భాగంగా సోమవారం పోలవరం వెళ్లనున్నారు.