CM Chandrababu: నేడు అన్నమయ్య జిల్లాకు సీఎం.. సంబేపల్లిలో పెన్షన్ల పంపిణీ..
- నేడు అన్నమయ్య జిల్లాకు ఏపీ సీఎం చంద్రబాబు ..
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం ..
- లబ్దిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేయనున్న సీఎం..
- సంబేపల్లిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌కు శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇవాళ అన్నమయ్య జిల్లాకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి సంబేపల్లి పీఎన్ కాలనీకి హెలికాప్టర్‌లో వెళ్తారు. హెలిపాడ్ నుంచి నేరుగా సంబేపల్లికి రోడ్ మార్గాన వెళ్తారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్ అందిస్తారు. దళిత మహిళ మంగమ్మతోపాటు బీసీ వర్గానికి చెందిన వికలాంగుడు గోర్ల వెంకటేష్ నివాసానికి చేరుకుని వారికి పెన్షన్ ఇస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు.
Read Also: Budget 2025: ఆదాయపు పన్నులో పెద్ద ఉపశమనం.. మధ్య తరగతికి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది కూటమి సర్కార్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా ఒకటవ తేదీకి పెన్షన్‌ను అందజేస్తోంది. ఒకవేళ ఆ రోజు సెలవు దినం అయితే కనుక ఒకరోజు ముందుగానే పించన్‌ను అందిస్తోంది. దాదాపు ప్రతి నెల ఏదో ఓ గ్రామంలోని పెన్షన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సంబేపల్లికి వెళ్తున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన ఏర్పాట్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పర్యవేక్షించారు. పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.
సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్..
* ఉదయం 11:10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న సీఎం..
* మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు..
* మధ్యాహ్నం 12:05 గంటల కు కడప ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న సీఎం..
* మధ్యాహ్నం 12:20 కి సంబేపల్లి మండలం పీఎన్ కాలనీ చేరుకోనున్న ఏపీ సీఎం..
* 12:40 గంటలకు సంబేపల్లి కు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్న సీఎం…
* 12:50 గంటలకు సంబేపల్లిలోని మంగమ్మ, గోర్ల వెంకటేష్ ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ..
* అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు…
* సంబేపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు…
* పీఎన్ కాలనీ నుంచి హెలికాప్టర్ లో కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. కడప నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!