Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
- గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- పాస్వర్డ్ తప్పుగా పెడితే ప్రమాదమే!
- ఆండ్రాయిడ్ 17లో భారీ సెక్యూరిటీ మార్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు తరచుగా ఫోన్ పిన్ లేదా పాస్వర్డ్ మర్చిపోతుంటే ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. గూగుల్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 17లో లాక్ స్క్రీన్ భద్రతను మరింత కఠినతరం చేయనుంది. పదేపదే తప్పు పిన్ లేదా పాస్వర్డ్ నమోదు చేస్తే ఫోన్ ఎక్కువసేపు లాక్ అయ్యేలా కొత్త భద్రతా విధానాన్ని తీసుకురానుంది. ఆండ్రాయిడ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మేనేజర్ మిషాల్ రెహమాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆండ్రాయిడ్ 17లో తప్పు పాస్వర్డ్ ప్రయత్నాలపై మరింత కఠినమైన పరిమితులు అమల్లోకి రానున్నాయి. దీంతో ఫోన్‌ను అనధికారికంగా అన్‌లాక్ చేయడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది.
ఎన్ని తప్పు ప్రయత్నాలకు ఎంతసేపు లాక్?
కొత్త ఆండ్రాయిడ్ 17లో పాస్వర్డ్ లేదా పిన్ను తప్పుగా నమోదు చేస్తే ఈ విధంగా లాకౌట్ అమల్లోకి వస్తుంది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
6 సార్లు తప్పు పాస్వర్డ్ – ఫోన్ 1 నిమిషం లాక్
7 సార్లు తప్పు పాస్వర్డ్ – 6 నిమిషాలు లాక్
8 సార్లు తప్పు పాస్వర్డ్ – 25 నిమిషాలు లాక్
12 సార్లు తప్పు పాస్వర్డ్ – 24 గంటలు లాక్
19 సార్లు తప్పు పాస్వర్డ్ – 5 సంవత్సరాల వరకు లాక్ అయ్యే అవకాశం
20 సార్లు తప్పు పాస్వర్డ్ – ఫోన్ శాశ్వతంగా లాక్ అయ్యే అవకాశం
పాత విధానంతో పోలిస్తే పెద్ద మార్పు
గతంలో ఆండ్రాయిడ్‌లో తప్పు పాస్వర్డ్ ప్రయత్నాలపై పరిమితులు అంత కఠినంగా ఉండేవి కాదు. ఒక నిమిషం, ఆరు నిమిషాలు, 25 నిమిషాలు, 24 గంటలు, చివరికి ఐదు సంవత్సరాల లాకౌట్ వంటి దశలకు చేరుకోవడానికి వందల నుంచి వేల వరకు తప్పు ప్రయత్నాలు అవసరమయ్యేవి. అయితే ఆండ్రాయిడ్ 17లో ఈ పరిమితిని గణనీయంగా తగ్గించడం వల్ల కొద్ది తప్పు ప్రయత్నాలకే ఫోన్ ఎక్కువసేపు లాక్ అయ్యే అవకాశం ఉంది.
కొత్తగా ‘డూప్లికేట్ గెస్ డిటెక్షన్’ ఫీచర్
యూజర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను కూడా అందిస్తోంది. డూప్లికేట్ గెస్ డిటెక్షన్ అనే ఈ ఫీచర్ వల్ల ఒకే తప్పు పాస్‌వర్డ్‌ను పదేపదే నమోదు చేసినా ప్రతి ప్రయత్నాన్ని విడిగా లెక్కించదు. అంటే పొరపాటున అదే తప్పు పిన్ను వరుసగా మళ్లీ నమోదు చేసిన సందర్భాల్లో అనవసరంగా లాకౌట్ వేగంగా పెరగకుండా ఈ ఫీచర్ సహాయపడుతుంది.
ఎప్పుడు విడుదల?
గూగుల్ ఇటీవల నిర్వహించిన Google I/O కార్యక్రమంలో ఆండ్రాయిడ్ 17ను పరిచయం చేసింది. ప్రస్తుతం దీని బీటా వెర్షన్ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లకు అందుబాటులో ఉంది. పూర్తి స్థాయి వెర్షన్ త్వరలో విడుదల కానుంది. అయితే ఈ ఫీచర్ తుది (స్టేబుల్) వెర్షన్లో ఇదే విధంగా అమల్లోకి వస్తుందా లేదా విడుదలకు ముందు గూగుల్ మార్పులు చేస్తుందా అనే విషయంపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.
- Tags
- Android 17
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!