రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌లో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేబినెట్ సమావేశంలో 45 నిమిషాలు వ్యవసాయరంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్‌పై చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు సీఎంకు వివరించారు.
Also Read: Mahanadu 2025: మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం!
అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం పడినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు వివరించారు. రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షించనుంది. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని సీఎం చెప్పారు.