CM Chandrababu: ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు… ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టిసారిస్తూ.. మొదటి రోజే ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.. ఆ తర్వాత.. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కొద్దిసేపు సమావేశం అయ్యారు.. ఈ భేటీలో సీఎం చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.. గడచిన ఐదేళ్లలో కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు ఏపీ సీఎం… ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్న ఆయన.. 95 నుంచి వివిధ దఫాలు సీఎంగా ఉన్నా.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు.. అయితే, గడచిన ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సూచించారు.. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ , ఐపీఎస్ లతో సమావేశం అవుతానని ఈ సందర్భంగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Read Also: Vijayawada Trains: రైలు ప్రయాణికులకు తీపి కబురు.. గతంలో రద్దైన విజయవాడ రైళ్ల పునరుద్ధరణ
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు సాయంత్రం సచివాలయంలో అడుగుపెట్టారు.. తన చాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఆ తర్వాత వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు.. అయితే, తొలిసారిగా సీఎం సచివాలయానికి రావడంతో.. ఆయన్ను కలిసేందుకు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్‌లు క్యూ కట్టారు.. వివాదస్పద అధికారులంతా సీఎం చంద్రబాబు కోసం ఫస్ట్ బ్లాక్ వైపు పరుగులు తీశారు.. అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయలు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణ ఇలా అంతా సీఎం చాంబర్ దగ్గరకు చేరుకున్నారు. కాగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీకి స్టేట్మెంట్ ఇచ్చారు అజేయ్ జైన్.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాటి ప్రభుత్వానికి పీఎస్సార్ ఆంజనేయులు పూర్తి స్థాయులో సహకరించారని అభియోగాలు ఉన్నాయి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌తో.. నాటి సీఎంవో అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని శ్రీలక్ష్మీపై ఆరోపణలు వచ్చాయి.. ఆర్థికశాఖలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని కేవీవీ సత్యనారాయణపై ఆరోపణలు ఉన్న విషయం విదితమే.