హైదరాబాదులో ఓకే ప్రదేశంలో రెండు సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా ప్రస్తుతానికి హైదరాబాద్ శివారు లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు. వారం రోజుల గ్యాప్ తర్వాత ఈ రోజే మరలా షూటింగ్ ప్రారంభమైంది. ఇక మరో పక్క అదే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన మరొక సెట్ లో హను రాఘవపూడి ప్రభాస్ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. మరో 20 రోజులు పాటు ఈ సినిమా షూటింగ్ అక్కడ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.
Mazaka : సినిమా వాళ్లా ‘మజాకా’ .. పగలే చుక్కలు!
ఫిబ్రవరి రెండో వారంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ మార్చి రెండు వరకు అక్కడే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక సినిమాకి ఫౌజీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది కానీ దానిమీద అధికారిక ప్రకటన లేదు. మొత్తం మీద టాలీవుడ్ లో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ ఒకే ప్రాంతంలో జరుగుతూ ఉండటం గమనార్హం. ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో కూడా ఇలాగే వరస షూటింగ్స్ జరిగేవి కానీ ఇప్పుడు షూట్ అప్డేట్స్ బయటకు వెళ్లకుండా లీక్స్ లేకుండా జాగ్రత్త పడేందుకు సినిమా టీమ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీని ఎంచుకోవడం గమనార్హం.