Minister Ponnam Prabhakar: హిమాయత్ సాగర్ జలాశయాన్ని ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. హిమాయత్ సాగర్ జలాశయం 4 ఫీట్లు వస్తె నిండిపోతుంది వర్షాలు తగ్గడం వల్ల ఇన్ఫ్లో తగ్గిందన్నారు. ఒక్క వర్షం వచ్చిన జలాశయం పూర్తిగా నిండి పోతుందన్నారు. జలాయశయం నిండితే కింద ఉన్న ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన జంట జలాశయాలు హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్ చూడడానికి రావడం జరిగిందన్నారు. ఒక వర్షం పడితే పూర్తిగా 5 వేల క్యూసెక్కుల నీళ్ళు వస్తె 10 గంటల్లో నిండి ఓవర్ ఫ్లో అవుతుందన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో వారిని కోరుతున్న ఇది విపత్కర సమయం ఇది రాజకీయాలకు సమయం కాదని తెలిపారు. రాజకీయాలు అసెంబ్లీ వేధికనో, ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామని అన్నారు.
Read also: Revanth Reddy Chitchat: ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా.. రేవంత్ రెడ్డి చిట్ చాట్
ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. ఒకరు అమెరికాలో ఉండి.. ఒకరు ఫార్మ్ హౌస్ లో ఉండి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈరోజు మరణాలు అన్ని ప్రమాదవశాత్తు జరిగాయన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినవి కావన్నారు. వారిని ఆడుకోవడానికి 5 లక్షల ఎక్స్ గ్రెషియ ఇస్తున్నాం..అందరినీ అప్రమత్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ యంత్రంగా హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టకుండా నిరంతరం 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్లి అక్కడ పర్యటించి రాత్రి అక్కడే ఉన్నారు. ఉదయం మహబూబాబాద్ వచ్చారు.. అన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. బీజేపీ నీ కోరుతున్న ఇంత పెద్ద విపత్తు జరిగింది.. లక్షల ఎకరాల నష్టం జరిగింది.. 5000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసింది.. జాతీయ విపత్తుగా తీసుకోవాలని అడుగుతున్న అని పొన్నం తెలిపారు. తక్షణం అంచనాలు తరువాత ముందు 2000 కోట్లు ఆర్థిక సహకారం చేయాలని కోరారు. పంట నష్టానికి , ప్రాణ నష్టానికి ,ఆర్థిక నష్టానికి సంబంధించి ప్రభుత్వ పంచాయతీ రాజ్ రోడ్లు & ఆర్ అండ్ బి రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి నష్టం జరిగిందన్నారు.
Read also: Damodar Raja Narasimha: గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ..
గతంలో ఇలాంటి ప్రకృతిలు వస్తె హైదరాబాద్ ప్రజలకు అమౌంట్ కూడా ఇయ్యని పరిస్థితి ఉండేదన్నారు. మా జిల్లా కొండగట్టు లో 69 మంది చనిపోతే కనీసం ఒక్కరూ కూడా వచ్చి పరమర్శించని పరిస్థితి అన్నారు. మానవీయ కోణం లేని మీరు మమ్మల్ని అడిగి ముందు మీరు గత ప్రభుత్వ పరిపాలనను చూసుకోవాలని తెలిపారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి అవసరమైతే తప్ప బయటకు రాకండి అన్నారు. వర్షాలు ఇప్పుడు ఉపశమనం కలిగించిన వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించిందన్నారు. అక్కడ పరిస్థితులను బట్టి పాఠశాలకు సెలవులు ప్రకటిస్తుందన్నారు. 33 జిల్లా కలెక్టర్లు గ్రామ కార్యదర్శి నుండి మొదలు సిఎస్ వరకు 24/7 పని చేస్తున్నారు. ఎక్కడైనా ఆపద ఉన్న విపత్తు కలిగితే కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మేల్యేలు,ఎంపీలు అందరూ ఉన్నారు. రాజకీయాలు అవసరం లేదు. అందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అందరం కలిసి కేంద్రం ను అడుగుదాం బడ్జెట్ లాగ మొండి చేయి చూపకుండా సహకరించాలన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ , బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్, హైదరాబాద్ , రంగారెడ్డి కలెక్టర్లు అనుదిప్ దురశెట్టి , శశాంక , ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. నేడు, రేపు మరో 20 రైళ్ళు రద్దు..