CM Chandrababu: కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే!
- నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు
- కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే
- రాష్ట్రంలో అసంఘటిత రంగంలో కార్మికులు ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికపై మాట్లాడారు.
‘ఈ రోజు మే డే. ఈరోజున కార్మికులు, కష్టజీవులు గుర్తుకొస్తారు. కార్మికులను దోపిడీ చేనేకుండా అనునిత్యం వారి తరఫున పోరాడి వారికి న్యాయం చేయడానికి పునరంకితమవుతాం. మన రాష్ట్రంలో అసంఘటిత రంగంలో కార్మికులు ఎక్కువ ఉన్నారు. ఇందులో వ్యవసాయంపై ఆధారపడిన వారే అధికం. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోంది. భవన నిర్మాణరంగంలో మహిళా కార్మికులే అధికంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలో కార్మికుల కోసం చక్రాన్ని పెట్టారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతున్నాం. కేంద్ర రాష్ట్రాలలోని ఎన్డీఏ ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నాం. దీని వల్ల సులభంగా ఇసుక దొరుకుతోంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
Also Read: CM Revanth Reddy: కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికే లక్షా 2 వేల కోట్లు అప్పు తెచ్చినా..
‘నిర్మాణ రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని కూడా రద్దు చేశా. భవనాల నిర్మాణ అనుమతులలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ పార్కులలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన భూముల సమీకరణకు రైతులు సహకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు జాతికి రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. అమరావతిలో 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చు లేకుండా రాజధానిని నిర్మిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
- Tags
- ap
- cm chandrababu
- may day
- Nellore
- tdp
తాజావార్తలు
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!