Gyanvapi: జ్ఞానవాపీ మసీదు వివాదంలో ఆ ప్రాంతాన్ని సర్వే చేయాలని 2022లో ఆదేశాలు జారీ చేసిని వారణాసి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్‌కి అంతర్జాతీయ నెంబర్ల నుంచి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీనిపై పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదైంది. 2022లో ఈ జ్ఞానవాపీ మసీదు ప్రాంగణాన్ని వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆయన ఆదేశించారు. ఈ బెదిరింపులపై బరేలీ ఎస్పీకి ఆయన లేఖ రాశారు. తనకు ఏప్రిల్ 15న ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందని, రెండ్రోజుల తర్వాత కూడా ఇలాంటిదే మరో కాల్ వచ్చిందని, తనకు ప్రాణహాని ఉందని జస్టిస్ దివాకర్ పేర్కొన్నారు. ఇటీవల బరేలీకి వదిలి అయిన ఆయన తన కుటుంబానికి కూడా బెదిరింపులు వచ్చాయని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు.
Read Also: Election Phase 2: రేపు రెండో విడత పోలింగ్.. రాహుల్ గాంధీ, శశిథరూర్‌తో పాటు పోటీలో కీలక వ్యక్తులు..
బరేలీకి బదిలీ అయిన తర్వాత, జస్టిస్ దివాకర్ 2018 బరేలీ అల్లర్ల కేసును సుమోటోగా తీసుకున్నారు. ఈ అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా ఉన్న మౌలానా తౌకీర్ రజాను విచారణ ఎదుర్కోవాల్సిందిగా ఆదేశించారు. ఈ అల్లర్లలో కోట్లాది రూపాయలన ఆస్తి నష్టం వాటిల్లింది. బరేలీలో 27 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు.
ఇదిలా ఉంటే, ఏప్రిల్ 2022లో కాశీ విశ్వనాథ మందిరాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపీ మసీదులో వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించారు. ఈ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోడలపై హిందూ దేవీదేవతల చిత్రాలతో పాటు మసీదు సముద్రాంలో వజూఖానాలోని కొలనులో శివలింగం ఆకారం బయటపడింది. అయితే, దీనిని హిందువలు శివలింగం అని చెబుతుండగా.. ముస్లింలు మాత్రం ఇది ఫౌంటేన్ అని చెబుతున్నారు. బెదిరింపులపై జస్టిస్ దివాకర్‌కి అలహాబాద్ హైకోర్టు వై-కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించింది, ఆ తర్వాత ఎక్స్-కేటగిరీకి తగ్గించింది.