Multibagger Stock : స్టాక్ మార్కెట్ అనేది అస్థిరమైన వ్యాపారం అని అందరికీ తెలుసు. దాంట్లో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరంగా భావిస్తారు. కానీ కొన్నిసార్లు అదే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్టాక్ మార్కెట్లో అలాంటి చాలా షేర్లు ఉన్నాయి. అవి పెట్టుబడి దారుల అదృష్టాన్ని మారుస్తాయి. వారు నమ్మలేనంతగా రాబడిని ఇస్తుంది. మిమ్మల్ని నేల నుంచి అంతస్తుకు తరలిస్తాయి. అలాంటి షేర్ గురించి నేడు తెలుసుకుందాం. 1 నుంచి రూ.121కి ఎగబాకి ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన బ్యాంకింగ్ స్టాక్ ఒకటుంది. అదే సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్ (City Union Bank Stock) దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే వారికి బంపర్ రిటర్న్‌లను అందించడానికి తోడ్పడింది.
Read Also:Samantha Ruth Prabhu Images: పాష్ లుక్‌లో సమంత.. పిక్స్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్స్ కొంతకాలంగా క్షీణతను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కానీ దీర్ఘకాలిక పెట్టుబడి పరంగా మల్టీబ్యాగర్ షేర్ అని నిరూపించబడింది. ఈ బ్యాంకింగ్ స్టాక్ పెట్టుబడిదారులకు రూ. 1 నుండి రూ. 121 వరకు ఉన్నప్పుడు 11,821 శాతం రాబడిని ఇచ్చింది. జనవరి 1, 1999న, సిటీ యూనియన్ బ్యాంక్ ఒక షేరు ధర కేవలం రూ.1.02. అప్పట్లో అందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఇప్పుడు లక్షాధికారులుగా మారి ఉంటారు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 205 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.119.50.
Read Also:Andhra Pradesh: గర్భిణికి ఆపరేషన్.. కడుపులోనే కత్తెర వదిలేసి కుట్లు..
ఈ కంపెనీ పనితీరును పరిశీలిస్తే.. దీర్ఘకాలిక పెట్టుబడిని నమ్ముకున్న వారికి అదృష్టానికి తాళం తీయడంలో కీలకపాత్ర పోషించింది. 1999 సంవత్సరం ప్రారంభంలో ఈ స్టాక్ ధర దాదాపు రూ. 1 ఉంటే జనవరి 2009 నాటికి ఈ స్టాక్ నెమ్మదిగా కదులుతూ రూ. 8 స్థాయికి చేరుకుంది. కానీ ఏడాది తర్వాత అంటే 2010 జనవరిలో దీని ధర రూ.10 పెరిగి రూ.18 అయింది. దీని తరువాత అందులో ప్రారంభమైన బూమ్ చాలా కాలం పాటు కొనసాగింది.