Insect rain in China : అదేంటో ప్రపంచంలో వింతలన్నీ చైనాలోనే జరుగుతుంటాయి. ఇలాంటి వింతతో మరోసారి ఆ దేశం వార్తల్లో నిలిచింది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో ఇటీవల పురుగుల వాన కురిసింది. అన్న ఉన్న కార్లుతో పాటు రోడ్లన్నీ పురుగులతో నిండిపోయాయి. పురుగుల పడుతుండగా అవి తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు వినియోగించారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీజింగ్ రోడ్డుపై నిలిచిన కార్లపై ఆకాశం నుంచి వర్షంతోపాటు పెద్ద సంఖ్యలో పురుగులు పడినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
Read Also: Village Road Bridge: వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి.. మర్రిచెట్టే వారికి వంతెన
అయితే పురుగుల వర్షానికి కారణం ఏమిటన్నది తెలియలేదని పేర్కొంది. భారీ గాలులకు బురదలోని పురుగులు పైకి కొట్టుకెళ్లి వర్షంతోపాటు ఇలా పడి ఉంటాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్‌వర్క్ తెలిపినట్లు చెప్పింది. తుఫాను తర్వాత వీచే భారీ గాల్లుల్లో పురుగులు, కీటకాలు చిక్కుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఆ జర్నల్ పేర్కొన్నట్లు వివరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బ్రహ్మంగారు చెప్పిన వింతలు ఇవేనేమో. కలియుగం ఇక అంతానికి దగ్గరగా వస్తోందని ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Read Also: Stomach Bloating: కడుపు ఉబ్బరంగా ఉందా ?.. నివారణ మార్గాలు ఇవీ
Breaking: China citizens told to find shelter after it looked like it started to rain worms.
pic.twitter.com/oTu4t4u86v— Antonio Sabato Jr (@AntonioSabatoJr) March 11, 2023