ఈ మధ్య కాలంలో కడుపు ఉబ్బరం సమస్య అధికమవుతోంది. ప్రతి ఇంట్లో ఒక్కరైన కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటారు. పొత్తికడుపు ఉబ్బరం సాధారణం. చాలా మంది ఒకే రకమైన ఉబ్బరాన్ని మళ్లీ మళ్లీ అనుభవిస్తారు. గ్యాస్ వల్ల వచ్చే ఉబ్బరం తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది.శారీరక శ్రమ లేకపోవడం, చాలాసేపు ఒకే చోట కూర్చుండటం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం సేవించడం మొదలగు అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి.అహారం బాగుందని పొట్ట ఖాళీ లేకుండా ఫుల్‌గా లాగించినా, ఎక్కువగా నీరు తాగినా, మలబద్ధకం ఉన్నా, ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, కడుపులో నొప్పి, గుండెలో మంట, తేన్పు రావడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉంటే ఏ పనీచేయలేం. జీర్ణాశయంలో, పేగుల్లో కొన్ని సూక్ష్మ జీవుల వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. అంతేకాకుండా విపరీతమైన ఒత్తిడిని అనుభవించటం. వ్యక్తిగత సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు, సామాజిక, మానసిక, అనారోగ్య సమస్యలు కూడా మనిషిని కుంగదీస్తున్నాయి. ఇలాంటి వాటి ద్వారా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి అది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా కడుపులో గ్యాస్, అధిక బరువు, ఉబకాయానికి దారితీస్తున్నాయి.
Alos Read:YS Viveka: వివేకా హత్యకు నాలుగేళ్లు.. వారికి శిక్ష పడాలన్న సునీత
తిన్న ఆహారం సరిగా జీర్ణం అవకపోతే ఏర్పడే సమస్య ఇది. అతిగా తినడం లేదా త్వరత్వరగా తినడం అలాగే ఒత్తిడి, స్మోకింగ్ ఆల్కాహాల్ అలవాట్లు ఉండటం అజీర్తికి కారణాలు. మనం ఆహారం మింగుతుండే సమయంలో గాలి మన జీర్ణవ్యవస్థ పొడవునా ఎప్పుడూ పెరిస్టాలిటిక్ చలనం రూపంలో వెళ్తూనే ఉంటుంది. ఇది పైనే ఉంటే తేన్పు రూపంలో బయటకు వెళ్తుంది. పైకి రాలేని విధంగా కాస్త కింద ఉంటే చిన్నపేగుల్లోంచి పెద్ద పేగుల్లోకి వెళ్లి మలద్వారం నుంచి బయటకు వెళ్తుంది. కానీ చాలా మందికి గాలి కడుపులో చిక్కుకుపోయి పొట్ట రాయిలాగా, కడుపు ఉబ్బరంగా ఉంటుంది.
Alos Read:Unique Wedding Ceremony: శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి!
ఉబ్బరం లేదా గ్యాస్ కలిగి ఉంటే మీరు బహుశా వైద్యుడిని చూడవలసిన అవసరం లేదు. కానీ ఉబ్బరం, గ్యాస్ , పొత్తికడుపు నొప్పికి కారణమయ్యే కొన్ని పరిస్థితులు చాలా తీవ్రమైనవి , ప్రాణాంతకమైనవి. అందుకే మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. కడుపు ఉబ్బరంగా ఉంటే.. వామాకు మంచి మెడిసిన్. రెండు ఆకులు కోసి తింటే చాలు.. మీకు కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. వామాకులో ఎ, బీ, సీ విటమిన్లు, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం ఉన్నాయి. అలాగే, ప్రతి రోజూ ఉదయం పుదీనా ఆకులు, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. పుదీనా కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది.