Elon Musk: అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా ఖండించారు. ధనిక దేశాలైన అమెరికా, జపాన్, ఇటలీలో జననాల సంఖ్య తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనాలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. జనాభా తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం పొరుగున ఉన్న చైనా ప్రవేశపెట్టిన వన్ చైల్డ్ పాలసీ కారణంగా ఆ దేశంలో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం మళ్లీ జనాభాను పెంచేందుకు డ్రాగన్ అవస్థలు పడుతోంది.