NTV Telugu Site icon

CM Revanth Reddy: మూసి పరివాహక ప్రాంతాల ప్రజలకు సీఎం గుడ్‌న్యూస్..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

మూసి పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పని చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసి పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధానం.. నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు చూడండని చెప్పరు. కాంగ్రెస్ ఇరిగేషన్.. ఎడ్యూకేషన్ మీదనే ఫోకస్ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ విజన్ తోనే దేశం ముందడుగు వేసిందని.. సాంకేతిక విప్లవం వచ్చినప్పుడు కంప్యూటర్ వద్దన్న వాళ్ళు ఉన్నారన్నారు. కానీ కంప్యూటర్ తో ఉద్యోగాలు పెరిగాయని.. ఆదాయం పెరిగిందని వెల్లడించారు. రాజీవ్ గాంధీ నూతన శకం ప్రారంభించారని కొనియాడారు. సిలింగ్ యాక్ట్ నీ కూడా దొరలు.. భూస్వాములు వ్యతిరేకించారని.. ఎప్పుడు ఎవరో ఒకరు వ్యతిరేకిస్తునే ఉంటరన్నారు. అధికారం కోల్పోయిన వాళ్ళు కొందరు ఇలా ప్రతిదీ అడ్డుకోవాలని చూస్తున్నారని.. అధికారులు.. మంత్రుల ముసుగులో దోచుకున్న బంది పోటు దొంగలు వాళ్ళు అని తీవ్రంగా విమర్శించారు. అలాంటి బందీ పోటు దొంగలు మూసిని అడ్డుకుంటున్నారని.. అద్దాల మెడల కోసం.. అందాల భామల కోసం మేము చేయడం లేదని మండిపడ్డారు.

READ MORE: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం

యూట్యూబ్ లతో అధికారం వస్తుందని అనుకుంటున్నారు.. మూసి లో ఉన్న మురికి కంటే ఎక్కువ.. వాళ్ల మెదడు అంత విషం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దుబాయ్ వెళ్లి.. సుందరీకరణ పేరుతో గుండు మీద జుట్టు పెంచుకొనే పాలసీ కాదని.. పోలీసులతో గుర్రాలతో తొక్కించినట్టు చేయమన్నారు. కొండపోచమ్మ , రంగనాయక సాగర్ , మల్లన్న సాగర్, కిష్టాపూర్ కి నేను సెక్యూరిటీ లేకుండా వస్తా.. మీరు వస్తారా అని బీఆర్‌ఎస్ నాయకులకు రేవంత్ సవాల్ విసిరారు. “రచ్చ బండ నిర్వహిద్దాం.. కేసీఆర్.. నీ నియోజక వర్గానికే వస్తా. రచ్చ బండ దగ్గర కూర్చొని మాట్లాడదాం. మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు ఇచ్చిన బాధ్యత కాబట్టి ప్రజలకు మేలు చేయాలన్న దే మా ఆలోచన. మూసి సుందరీకరణ కాదు. ప్రక్షాళన. దుబాయ్ వెళ్లి జుట్టు మొలిపించుకునే టట్టు కాదు. నది ప్రవహించే నగరం దేశం లోనే లేదు. అలాంటి నగరం హైదరాబాద్ లో ఉంది. దాన్ని పాలకుల నిర్లక్షం వల్ల మురికి కూపం అయ్యింది. మూసి పునరుజ్జీవం పోస్తాం. సమస్యలు తెలుసుకుని ఒక్కొక్కరిని తరలించాలని మా ఆలోచన” అని సీఎం రేవంత్ అన్నారు.

READ MORE: Rana Daggubati: రానా సమర్పించు.. బాలీవుడ్లోకి సూపర్ హిట్ రీమేక్!!

ఆరు నెల్ల నుంచి అధికారులు సర్వే చేస్తున్నారని.. వేములఘాట్.. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు.. ఎవరికైనా ఇండ్లు.. ఇంటి తాళం ఇచ్చారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. “మిడ్ మనేరు ను పిల్లను ఇచ్చిన పాపానికి ఊరి నే ముంచారు. హైడ్రా ఏదైనా బూతమా.. ఫార్మ్ హౌస్ లో ఉన్న దొరనా. వచ్చి కబలించుకు పోవడానికి.. బఫర్ జోన్ లో 10 వేల ఇండ్లు ఉన్నాయి. వారిని ఎలా ఆదుకోవాలి.. బెటర్ లైఫ్ ఎలా ఇవ్వాలి అని ఎంఎల్ఏ లతో మాట్లాడండి అని మంత్రులకు చెప్పినం. బుల్డోజర్ లు మామీద నుంచి పోనియ్యాలి అని పోటీ పడుతున్నారు. నగరాన్ని సర్వ నాశనం చేయదలుచుకున్నారా
వర్షం వస్తె చెన్నై.. బెంగుళూరు ఏమైంది చూశారా..? దుబాయ్ ఏమైంది. వయనాడ్ లో పరిస్థితి ఏమైందో తెలియదా ఖమ్మం.. విజయవాడ మునిగి పోయింది. కండ్ల ముందు చూశాం. మూసి వల్ల మాకు ఆర్థిక ప్రయోజనం ఏమైనా ఉందా మాకు..? ఉప్పెన వచ్చిందంటే.. కొట్టుకు పోతాం. నాకు అనుకున్నవి అన్ని వచ్చాయి. నాకేమైనా వస్తుందా.. మీరంతా చెప్పండి.. వద్దు అంటే వదిలేద్దాం. టెండర్ క్యాన్సల్ చేసి పంపుతాం. నల్గొండ వాళ్ళ బాధలు పట్టవా. నల్గొండ వాళ్లంతా అడుగుతున్నారు. అడగడం అన్నా.. మానేయండి. నల్గొండ ప్రజలు మౌనగా ఉంటే ఎలా. నన్ను బ్లేమ్ చేసేది ఓ దోపిడీ దొంగ
వాడు నన్ను తిడితే బాధ పడను. లక్ష 50 కోట్లు అంటున్నాడు. ఇదేమైనా కాళేశ్వర మా?” అని ప్రతిపక్షాలను సీఎం ప్రశ్నించారు.