Rana to Make Maanaadu Remake in Bollywood: దగ్గుబాటి రానా ఇప్పుడు సినిమాల్లో నటించడం కంటే ఎక్కువ ప్రొడక్షన్ అలాగే చిన్న సినిమాల్ని పుష్ చేయడం వంటి పనిలే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే వెంకట్ ప్రభూ దర్శకత్వంలో తెరకెక్కిన మానాడు అనే సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. టైం లూప్ ఆధారంగా రాసుకున్న ఈ కథకు తమిళ ప్రేక్షకుల ఫిదా అయ్యారు. సినిమా హిట్ అయిన కొద్ది రోజులకే ఈ సినిమాకు సంబంధించి ఆల్ ఇండియా రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ రేటుకి కొనుగోలు చేసింది. నిజానికి ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు.
Akhil Akkineni: మరో సినిమాకి అయ్యగారి గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?
అయినా సరే తెలుగులో కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఫైనల్ గా తెలుగులో రీమేక్ చేయడం లేదు కానీ బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2021లో రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించిన ఆకాశవాణి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అశ్విన్ గంగరాజు ఈ హిందీ మానాడు స్క్రిప్ట్ మీద కూర్చున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దాన్ని ఒక రీమేక్ లాగా కాకుండా అడాప్షన్ లాగా హిందీ ఆడియన్స్ మిచ్చేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఆయనే ఈ సినిమాని హిందీలో డైరెక్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రానా ఈ సినిమాలో నటించడం లేదు కానీ బాలీవుడ్ లో బాగా తెలిసిన ఫెమిలియర్ యాక్టర్స్ ను ఈ స్క్రిప్ట్ చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. సినిమాని తన స్పిరిట్ మీడియా బ్యానర్ మీద నిర్మిస్తూనే హిందీలో ఇంకా ఎవరైనా నిర్మాతలు దొరుకుతారేమో అని కూడా చూస్తున్నట్లుగా తెలుస్తోంది.