CM Chandrababu: వరద బాధితులను ఆదుకునేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం..
- వరద బాధితులకు పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- ఎన్యుమరేషన్ పై మంత్రులు.. అధికారులతో సీఎం రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని.. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేరాలని అన్నారు. సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని.. పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సీఎం తెలిపారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే.. 17వ తేదీ బాధితులకు సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు.
YS Jagan: ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
ఎన్యుమరేషన్ జరుపుతున్న విధానాన్ని, వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇళ్లు పూర్తిగా మునిగి ఆస్తి నష్టం జరిగిన వారితో పాటు.. మొదటి ఫ్లోర్ లో ఉన్నవారికి సైతం సాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వరద కారణంగా ఇంట్లో వస్తువులు అన్నీ పాడైపోయిన మొదటి అంతస్తువారికి ఒక మొత్తం, రెండో ఫ్లోర్ నుంచి ఆ పైన ఉన్నవాళ్లకి కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే దెబ్బతిన్న ద్విచక్రవాహనాలకు కూడా పరిహారం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు.
Chittoor District: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు
ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆర్థిక సాయం పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీటమునిగినట్లు ప్రభుత్వం అంచానా వేస్తోంది. ఇందులో ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తి అయ్యాయి. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు డ్యామేజ్ అయ్యాయి. 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వీటికి కూడా పరిహారం అందిచనున్నారు. ఎన్యుమరేషన్లో రీ వెరిఫికేషన్ జరిపి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి. నారాయణ, నాదెండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!