చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. 40 మందికి గాయాలయ్యాయి. మొగలి ఘాట్ రోడ్ దగ్గర బస్సు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. రెండు లారీలను బస్సు ఢీకొట్టింది. పలమనేర్ నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పక్క రోడ్లోకి దూసుకెళ్లి 2 లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
కాగా.. నిన్న కూడా తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమ దారిలో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: IND vs BAN: చెన్నైలో ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియా.. జాయిన్ అయిన స్టార్ ప్లేయర్
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని
ఆయన భరోసా ఇచ్చారు.