Chhaava : ఛత్రపతి శంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన చావా మూవీ దూసుకుపోతోంది. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా.. ఎక్కడ రిలీజ్ అయినా సరే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ.. ఆల్ టైమ్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా రికార్డులను కొల్లగొట్టింది. విక్కీ కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ సినిమా.. ఇప్పుడు బాహుబలి-2 రికార్డును కూడా చెరిపేసింది. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ హిందీలో రూ.510.99 కోట్లు వసూలు చేసింది. ఆ కలెక్షన్లను చావా మూవీ బ్రేక్ చేసింది.
Read Also : Exclusive: రవితేజ కొడుకు హీరో అవుతాడు అనుకుంటే ఇలా చేశాడు ఏంటి?
చావా సినిమాకు ఇప్పటి వరకు హిందీలో రూ.516.8 కోట్లు వచ్చాయి. ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గానే ఆడుతోంది. ఇటు తెలుగులో లేట్ గా రిలీజ్ చేసినా ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. తెలుగులో రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.10 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్టు సమాచారం. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుండటంతో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిగతా భాషల్లో కూడా డబ్ చేస్తున్నారు. ముందే డబ్ చేసి ఉంటే కలెక్షన్లు ఇప్పటికే భారీగా పెరిగేవి. ఆలస్యంగా రిలీజ్ చేసినా భారీగా రెస్పాన్స్ వస్తుండటంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీలో ఉంది.
Read Also : JR NTR : ఎన్టీఆర్ కొత్త లుక్ చూశారా.. ఆ మూవీ కోసమేనా..?