రవితేజ కొడుకు మహాధన్ రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి భళా అనిపించుకున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాలో అతని పాత్ర చూసి, అతని నటన చూసి భవిష్యత్తులో కచ్చితంగా హీరో మెటీరియల్ అని అందరూ భావించారు. అయితే అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఒక షాకింగ్ న్యూస్ తాజాగా తెలుస్తోంది. అదేంటంటే రవితేజ కొడుకు మహాధన్ స్పిరిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయబోతున్నాడు.
JR NTR : ఎన్టీఆర్ కొత్త లుక్ చూశారా.. ఆ మూవీ కోసమేనా..?
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ స్పిరిట్ అనే సినిమా రూపొందాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ కొడుకులతో పాటు రవితేజ కొడుకు మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయబోతున్నాడు. ఇప్పటికే మరో 12 నుంచి 14 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. కానీ ఒక స్టార్ హీరో కుమారుడుతో పాటు ఒక స్టార్ డైరెక్టర్ కుమారులైన ఇద్దరూ ఇప్పుడు స్పిరిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేయబోతూ ఉండడం హాట్ టాప్ పిక్ అవుతోంది.