Cheteshwar Pujara: టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన ప్రముఖ ఆటగాడు చతేశ్వర్ పుజారా తన 20 ఏళ్ల క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. తాజాగా ఆయన అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. గత కొంతకాలంగా పుజారా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. చివరిసారి 2023లో ఆస్ట్రేలియాతో లండన్‌లోని ది ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పుజారా ఆడాడు. ఆ తర్వాత నుంచి భారత జట్టులోకి ఆయనకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపించలేదు. నిజానికి ఆస్ట్రేలియా పర్యటనలో ఆయనను ఎంపిక చేస్తారన్న ఊహాగానాలు వచ్చినా.. సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ఆ సిరీస్‌లో భారత్ ఓటమి పాలవడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు కూడా టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఈ నేపథ్యంలో పుజారా కూడా తన క్రికెట్ కెరీర్‌ను గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు.
Minister Narayana: చెత్త పన్ను వేసిన చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీ
తన రిటైర్మెంట్ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన పుజారా భావోద్వేగపూర్వకంగా స్పందించాడు. “భారత జెర్సీ వేసుకుని, జాతీయ గీతం ఆలపిస్తూ మైదానంలో అడుగుపెట్టడం.. ఆ క్షణాలు నా జీవితంలో ఎన్నటికీ మరవలేనివి. అయితే ప్రతి మంచి విషయానికి ఒక ముగింపు ఉంటుంది. ఎంతో కృతజ్ఞతతో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను” అని రాసుకొచ్చారు. అలాగే తన చిన్ననాటి కలను నెరవేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తన కెరీర్లో మెంటర్లు, కోచ్‌లు, గురువులు ఇచ్చిన మార్గదర్శకత్వానికి తాను ఎప్పటికీ ఋణపడి ఉంటానని తెలిపాడు. సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, అంపైర్లు, మీడియా, గ్రౌండ్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
Realme New Phone: రియల్మీ నుంచి సరికొత్త ఫోన్.. 10000 ఎంఏహెచ్ బ్యాటరీ, 320W ఫాస్ట్ ఛార్జింగ్!
ఫ్యాన్స్ ఇచ్చిన ప్రేమ, ప్రోత్సాహం తన కెరీర్లో ఎనలేని ప్రోత్సాహాన్నిచ్చాయని పుజారా గుర్తు చేసుకున్నాడు. చివరగా తన కుటుంబ సభ్యుల త్యాగాలు, మద్దతు లేకపోతే ఈ స్థాయికి రాలేనని పేర్కొన్నాడు. “నా తల్లిదండ్రులు, భార్య పూజా, కూతురు ఆదితి, నా బంధువుల మద్దతే నాకు బలం” అని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఇకపై తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని, కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని పుజారా స్పష్టం చేశాడు. తన ఆత్మనిబద్ధత, శాంతమైన ఆటతీరు వల్ల “మోడరన్ వాల్”గా పేరుపొందిన పుజారా.. ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో సుస్థిరమైన ముద్ర వేసిన ఆటగాడిగా గుర్తుండిపోనున్నాడు.
Wearing the Indian jersey, singing the anthem, and trying my best each time I stepped on the field – it’s impossible to put into words what it truly meant. But as they say, all good things must come to an end, and with immense gratitude I have decided to retire from all forms of… pic.twitter.com/p8yOd5tFyT
— Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2025