Minister Narayana: మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. చెత్తను బయో మైనింగ్ చేస్తున్న విధానాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అదేశాలు ప్రకారం అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగిస్తాం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 85 లక్షల లెగసీ వేస్ట్ ఉంది.. ఇప్పటి వరకూ 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉంది.. మచిలీపట్నంలో మొత్తం 42 వేల టన్నుల చెత్తకు గాను 19 వేల టన్నులు పూర్తిగా తొలగించాం.. ఇక్కడ అదనంగా మెషీన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పొంగూరు నారాయణ తెలిపారు.
Read Also: Niharika : చనిపోయే ముందు చివరి క్షణంలా ఉంది.. నిహారిక కొణిదెల పోస్ట్ వైరల్
ఇక, గత ప్రభుత్వం అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త కూడా వదిలి వెళ్ళిపోయిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. చెత్త పన్ను వేసినా చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీది అని మండిపడ్డారు. ప్రజలకు రోగాలకు కారణమయ్యే ఘన,ద్రవ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నాం.. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.. రాష్ట్రంలో ప్రతి రోజూ వచ్చే 7500 టన్నుల సాలిడ్ వేస్ట్ కోసం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల్ ఏర్పాటు చేస్తున్నాం.. ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం రాబోయే రెండేళ్లలో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నామని నారాయణ వెల్లడించారు.