Charlapally Drug Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను లోతుగా కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నిందితుడైన ‘విజయ్ ఓలేటి’ సంబంధించి అనేకజా విషయాలను పోలీసులు రాబట్టారు. అతను 12 సంవత్సరాల పాటు GVK బయో సైన్స్ లో కెమికల్ అనాలిస్ట్‌గా పని చేశాడు. ఆ తర్వాత ఐదు సంవత్సరాల క్రితం ఆయన బయోసైన్స్ కంపెనీ నుండి బయటకు వచ్చి కెమికల్ తయారీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. నిందితుడు విజయ్ ఓలేటి, మహారాష్ట్ర నుండి వచ్చిన తానాజీ పట్వారీ తో కలిసి వాగ్దేవి ఫార్మా పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి.. ఐదేళ్లుగా సింథటిక్ డ్రగ్స్ ఉత్పత్తిలో నిమగ్నమయ్యాడు. ఈ యూనిట్‌ని అతి కొద్ది సిబ్బందితో మాత్రమే నడిపించారు. అది కూడా చాలారోజులు రాత్రిపూట మాత్రమే కార్యకలాపాలను చేపట్టేవాడు.
Drugs Rocket: చర్లపల్లిలో డ్రగ్స్ డెన్.. వెలుగులోకి దారుణ విషయాలు!
ఈ నేపథ్యంలో నిందితుడు విజయ్ అత్యంత ప్రమాదకరమైన మెఫీడిన్ ఉత్పత్తితో ప్రారంభించి, ఆ తరువాత ఎక్సెసి మోలీ, XTC, MDMA వంటి ప్రమాదకరమైన డ్రగ్ లను తయారు చేసి ముంబై, గోవా, బెంగళూరు వంటి నగరాలకు సరఫరా చేసేవాడు. ఈ దందాలో భాగంగా.. విజయ్, తానాజీ రూపొందించిన డ్రగ్ సరఫరా ముఠాలు దేశవ్యాప్తంగా పనిచేసేవి. దాంతోపాటు, విజయ్‌కు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో కూడా సంబంధాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీనితో కేసును పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.
సూపర్ స్లిమ్ డిజైన్, టాప్-క్లాస్ AI ఫీచర్స్, IP68+IP69+IP69K సర్టిఫికేషన్లతో Nubia Air లాంచ్!