Drugs Rocket: హైదరాబాద్ శివారు ప్రాంతాన్ని కేంద్రంగా.. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్‌వర్క్‌పై మహారాష్ట్ర పోలీసులు భారీ దాడి నిర్వహించారు. చర్లపల్లిలోని నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో ఏర్పాటు చేసిన గుట్టు యూనిట్‌లో మత్తు పదార్థాల ఉత్పత్తి జరుగుతుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసుల అకస్మిక దాడిలో 5.96 కిలోల మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. యూనిట్ యజమాని వోలేటి శ్రీనివాస్ విజయ్, అతని సహాయకుడు తానాజీ పట్వారీని అరెస్ట్ చేసి కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఆధారంగా ముంబయికి తరలించారు.
CM Reventh: ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవాలు.. హర్షం వ్యక్తం చేసిన సీఎం!
ముంబయిలో ఈ డ్రగ్స్ నేపథ్యంలో బంగ్లాదేశీ మహిళ ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లా అరెస్ట్ అయ్యింది. ఆమె వద్ద 105 గ్రాముల మెఫిడ్రిన్ స్వాధీనం అయ్యింది. మహిళ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పొలిసు అధికారులు. నాలుగేళ్ల క్రితం లీజుకు తీసుకున్న భవనాన్ని ఫార్మా ఉత్పత్తుల పేరుతో యూనిట్‌గా నడుపుతూ.. గుట్టుగా మెఫిడ్రిన్ తయారీ కొనసాగించగా, దేశవ్యాప్తంగా ఉన్న లింక్స్ పై మహారాష్ట్ర పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
ఏజ్ జస్ట్ జస్ట్ నెంబర్.. బౌలర్లపై విరుచకపడ్డ Kieron Pollard! 17 బంతుల్లోనే?