AP Caste Survey: ఏపీలో కులగణన ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేర్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Caste Survey: ఏపీలో కులగణన ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనవరి 19 తేదీ నుంచి 28 తేదీలోగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గ్రామవార్డు సచివాలయ సిబ్బంది, ఎన్యుమరేటర్లు వారం రోజుల్లో ఇంటింటికీ వెళ్లి కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. మొత్తం 10 రోజుల్లో ఈ కులగణన ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also: TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్కియాలజీ శాఖ
Also Read
- Bangladesh: క్రికెటర్‌పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్‌లో కలకలం
- Iran: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఎప్పుడంటే..!
- Women's T20 World Cup: ‘జట్టులోకి ఆమె రావడంతో బలం పెరిగింది.. టీ20 ప్రపంచకప్ భారత్‌దే’
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్‌కు సీఎం యోగి వార్నింగ్..
ఇంటింటి కులగణన ప్రక్రియలో అందుబాటులో లేని వ్యక్తులకు సచివాలయాల్లో నమోదుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 తేదీ వరకూ 5 రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి 15 తేదీనాటికి గ్రామవార్డు సచివాలయాల శాఖ వద్ద కులగణనకు సంబంధించిన తుది నివేదిక సిద్ధం కావాలని సర్కారు ఆదేశించింది. కులగణన కోసం సచివాలయ సిబ్బందికి ఇచ్చే శిక్షణను జనవరి 11 తేదీ లోగా ముగించాలని ఆదేశించింది. ఎన్యూమరేటర్లు, సచివాలయ సిబ్బంది, సూపర్ వైజర్ల మ్యాపింగ్ 12 తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కులగణనలో భాగంగా సామాజిక ఆర్ధిక, విద్యా, ఉపాధి అంశాలపై వివరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజావార్తలు
-
Bangladesh: క్రికెటర్‌పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్‌లో కలకలం
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Smart Kitchen Hacks: వంటింట్లో ఇలా చేస్తే శ్రమ, సమయం, డబ్బు ఆదా.. గృహిణులకు మోస్ట్ యూస్ఫుల్ టిప్స్!
-
Iran: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఎప్పుడంటే..!
-
Varanasi : విశాఖ.. గెట్ రెడీ.. బాబు దిగుతున్నాడు!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!