జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందుకోసం ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. మరోవైపు చంద్రయాన్-3 లైవ్ చూడటానికి పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకు తగ్గట్టు.. చంద్రయాన్ విజయవంతమైతే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.