Anant Ambani and Radhika Merchant’s dog Happy in Sherwani: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో ప్రముఖులే కాదు.. కుక్క కూడా సందడి చేస్తోంది. పట్టు వస్త్రాలను పోలిన షేర్వానీ ధరించిన ఓ కుక్క పెళ్లి ఇంట తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం సుదీర్ఘ వేడుకల అనంతరం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వేల కోట్ల రూపాయలతో జరిగిన ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివచ్చారు. ఇక పెళ్లి తర్వాత ఒక్కొక్కటిగా పెళ్లికి సంబంధించిన విశేషాలు, ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ వివాహం గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.
MAA Action: నటీనటుల అసభ్యకర వీడియోలు.. ఐదు యూట్యూబ్ ఛానల్స్ లేపేసిన ‘మా’
ముఖ్యంగా అంబానీల కుక్క పేరు హ్యాపీ. అంబానీ కుటుంబానికి చెందిన కుక్క గతంలో పెళ్లికి ముందు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా ఇదే కుక్క అనంత్‌కు ఉంగరాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు పెళ్లి ఇంట్లో కూడా కుక్క తిరుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక దీంతో అంబానీలకు సన్నిహితం ఎక్కువ. ఈ విషయాన్ని గతంలో నీతా అంబానీ కూడా చెప్పారు. నేను ముగ్గురు పిల్లల తల్లిని మాత్రమే కాదు, కుక్కకు కూడా అని ఆమె కామెంట్ చేసింది. ఇది గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ కి చెందిన కుక్క. అనంత్‌కి జంతువులంటే చాలా ఇష్టం. 5000 కు పైగా వీధి కుక్కలను అనంత్ రక్షించాడని అతని తల్లి నీత తెలిపారు. ఏనుగులను కూడా సంరక్షిస్తున్న అనంత్ సింహాలు, మొసళ్లు, వివిధ జాతుల పక్షులను కూడా సంరక్షిస్తున్నారు.