CM Chandrababu Naidu: కలెక్టర్ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా.. పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని కనియాడారు.. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందన్నారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారు.. ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే.. తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు. తాజాగా అమరావతిలో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్ష, చర్చలు జరగాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలన్నారు. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నామని తెలిపారు.
READ MORE: Panchayat Elections Live Updates: జోరుగా గ్రామాల్లో పోలింగ్..
నిర్దేశించిన లక్ష్యాల ద్వారా ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. “వ్యవస్థలో ఉండే లోపాలను గుర్తించి వాటిని వినియోగించి పని నుంచి తప్పించుకునే పరిస్థితులు వచ్చాయి. రెవెన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఫైళ్లను పరిష్కరించుకుండా తమ వద్ద నుంచి వేరే వారికి పంపించేస్తున్నారు. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలి.. డేటా డ్రివెన్ గవర్నెన్సు ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి.. మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం.. కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉంది.. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుంది. లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారు.. ప్రతి శాఖ ఆన్ లైన్ ద్వారా ఫైళ్లు నడపాలి సేవలు అందించాలి. గత పాలకుల నిర్వాకం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. వాటిని తిరిగి ప్రవేశపెట్టాం. ” అని సీఎం చంద్రబాబు సూచించారు.