గంజాయి యువత ప్రాణాలు తీస్తుంది.. వారిని హంతకులనూ చేస్తోంది.గంజాయి అక్రమ రవాణా పెరిగిపోవడంపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయిపై ప్రభుత్వ ఉదాసీనంగా ఉంటే దాని దుష్ఫలితం మన బిడ్డల వరకూ తెస్తుంది.ఏపీలో విచ్చలవిడి గంజాయి వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేస్తోంది.ఏకంగా ప్రాణాలను కూడా తీస్తోంది.
విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసింది.మరో 5 గురిని హంతకులను చేసింది.. దీనికి ఈ ప్రభుత్వ సమాధానం ఏంటి? వాడవాడలా విస్తరిస్తున్న గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకు..?ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా?ఈ ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి మన బిడ్డల వరకు వస్తుందని మర్చిపోకండి.పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ ని డిమాండ్ చేశారు చంద్రబాబునాయుడు.
Read Also: Kushi: ‘ఆరా బేగమ్’పై మనసు పారేసుకున్న ‘ది’ దేవరకొండ…