పంజాగుట్టలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాన్‌బాగ్ హోటల్‌లోని ఐదో అంతస్తులో మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బంది రంగంలోకి మంటలార్పుతున్నారు. కాగా.. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం భారీ అగ్ని ప్రమాదం కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర పొగలు అలుముకున్నాయి.