Chandrababu and Pawan Kalyan: ఢిల్లీకి చంద్రబాబు – పవన్ కల్యాణ్..! విషయం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and Pawan Kalyan: ఏపీ పొలిటికల్ హీట్ ఢిల్లీని తాకబోతున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే ఉమ్మడిగా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ – జనసేన పార్టీ.. ఇక, ఈ రోజు తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి సభ నిర్వహించనున్నారు.. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభా స్థలికి చేరుకుంటున్నారు.. రెండు పార్టీలు ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నాయి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు 500 మంది నేతలు వేదికను పంచుకోబోతున్నారు. ఈ సభకు దాదాపు 6 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా రెండు పార్టీల శ్రేణులకు నేతలు దిశానిర్ధేశం చేయనున్నారు.
Read Also: Telangana Temperature: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మార్చిలో మరింతగా పెరగనున్న ఉష్ణోగ్రతలు!
Also Read
- Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
అయితే, తాడేపల్లిగూడెం సభ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు.. ఇక, ఒకట్రోండు రోజుల్లో చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్తారని ప్రచారం సాగుతోంది.. రేపు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం జరగనుంది.. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. దీంతో.. బీజేపీ తొలి జాబితా విడుదలకు ముందే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో ఢిల్లీ బీజేపీ పెద్దలు భేటీ కానున్నారనే ప్రచారం సాగుతోంది.. ఇక, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆరేడు ఎంపీ స్థానాలను ఆశిస్తోందట భారతీయ జనతా పార్టీ.. అరకు, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, హిందూపురం లోక్ సభ స్థానాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో చంద్రబాబు-పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఎలా సాగుతోంది.. పొత్తుల వ్యవహారం తేలుతుందా? మరోసారి టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్‌ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?