Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- 'ఇండియాస్ గాట్ లేటెంట్ 2'
- బీహార్ ఉపాధ్యాయురాలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు
- సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ కామెడీ షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ సీజన్ 2 మరోసారి వివాదాల్లో నిలిచింది. మూడో ఎపిసోడ్లో పాల్గొన్న కంటెస్టెంట్ సాక్షి ఝా తన ప్రదర్శన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. తనను తాను “పురుష ద్వేషి (Man Hater)”గా అభివర్ణించుకోవడంతో పాటు, పురుషుల గురించి చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల నుంచి విమర్శలకు దారితీశాయి.
‘నాకు మగవాళ్లంటే ద్వేషం’
బీహార్‌కు చెందిన సాక్షి ఝా ఓ ఉపాధ్యాయురాలు, అలాగే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. తన ప్రదర్శన ప్రారంభంలోనే ఆమె మాట్లాడుతూ, “నా పేరు సాక్షి. నాకు మగవాళ్లంటే అసహ్యం. పురుషుల అహంకారాన్ని దెబ్బతీయడం నాకు ఆనందంగా ఉంటుంది.” అని వ్యాఖ్యానించింది. తాను మహిళ కావడం వల్ల సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని కూడా ఆమె పేర్కొంది. అంతేకాకుండా, తనకు పురుషులపై మాత్రమే కాకుండా, తన తండ్రి, సోదరుడిపై కూడా వ్యతిరేక భావాలు ఉన్నాయని చెప్పింది.
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
భర్తపై చేసిన వ్యాఖ్యలతో వివాదం
షోలో జరిగిన సంభాషణలో సాక్షి చేసిన మరో వ్యాఖ్య మరింత వివాదానికి దారితీసింది. తన జీవిత లక్ష్యం గురించి మాట్లాడుతుండగా, “నా భర్తకు మద్యం తాగించి చంపేయాలని అనిపిస్తుంది” అని చెప్పింది. ఈ వ్యాఖ్యను పలువురు తీవ్రంగా తప్పుబట్టారు. హింసను ప్రోత్సహించేలా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
జడ్జిల నుంచి సున్నా స్కోరు
సాక్షి ప్రదర్శన న్యాయనిర్ణేతలను ఆకట్టుకోలేకపోయింది. షో హోస్ట్ సమయ్ రైనాతో పాటు తన్మయ్ భట్, విశాల్ దద్లానీ, రఘు రామ్, యశ్‌రాజ్ మెహ్రా ఆమెకు 0 స్కోరు ఇచ్చారు. దీంతో ఈ సీజన్లో జడ్జిల నుంచి సున్నా స్కోరు పొందిన తొలి కంటెస్టెంట్‌గా సాక్షి ఝా నిలిచింది.
సోషల్ మీడియాలో విమర్శలు
ఎపిసోడ్ విడుదలైన తర్వాత సాక్షి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఆమె వ్యాఖ్యలను “అతి”గా అభివర్ణించారు. మరికొందరు ద్వేషపూరిత వ్యాఖ్యలు వినోదం పేరుతో ప్రోత్సహించకూడదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు షోలో ఇలాంటి కామెడీని అనుమతించడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, కొందరు సోషల్ మీడియా యూజర్లు ఇది స్టేజ్ పెర్ఫార్మెన్స్లో భాగంగా చేసిన కామెడీ అని పేర్కొంటూ, వ్యాఖ్యలను సందర్భానుసారంగా చూడాలని అభిప్రాయపడ్డారు.
చర్చనీయాంశంగా మారిన ఎపిసోడ్
సాక్షి ఝా వ్యాఖ్యలతో ‘ఇండియాస్ గాట్ లేటెంట్ 2’ మూడో ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కామెడీ, వ్యక్తిగత అభిప్రాయాలు, ద్వేషపూరిత వ్యాఖ్యల మధ్య గీత ఎక్కడ గీయాలనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!