YS Jagan Slams Chandrababu: మా హయాంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారని ప్రచారం చేశారని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నిరంతరం బురద జల్లే కార్యక్రమాలు చేస్తారు.. మా దురదృష్టం ఏమిటంటే నిజాలు గడప దాటేలోపే చంద్రబాబు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేశాయి.. మా హయాంలో మాన్యుఫ్యాక్టరింగ్ గ్రోత్ యావరేజ్ రేటు సౌత్ ఇండియాలో మొదటి స్థానం.. దేశంలో మొదటి స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఐదేళ్లలో పారిశ్రామిక రంగ వృద్ధిరేటు దేశంలో 8వ స్థానం.. సౌత్ ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నాం.. కానీ, చంద్రబాబు మాత్రం మాపై టన్నుల కొద్దీ బురద చల్లుతున్నారని జగన్ పేర్కొన్నారు.
Read Also: AOR Trailer : అనగనగా ఒక రాజు.. అసలైన పండగ ట్రైలర్ వచ్చేసింది..
ఇక, చంద్రబాబు హయాంలోనే పారిశ్రామిక వేత్తలు బెదిరిపోతున్నారని వైఎస్ జగన్ చెప్పారు. జిందాల్, అరబిందో, మైహోం, దాల్మియా సిమెంట్స్, షిర్డీ సాయి, భారతి సిమెంట్స్ తరలి వెళ్తున్నాయని పేర్కొన్నారు. వీళ్లకు కప్పం చెల్లించకపోతే పరిశ్రమలు నడిపే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ఈ మధ్య కొత్త డ్రామా ఆడుతున్న చంద్రబాబు.. కొత్త సంవత్సర వేడుకలు విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఎక్కడకు వెళ్లారో కూడా ఎవరికీ తెలియదు.. పారిశ్రామిక ప్రతిపాదనల్లో దేశంలో ఏపీ నంబర్ వన్ అని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
Read Also: YS Jagan: భోగాపురం ఎయిర్పోర్టు పేరుతో క్రెడిట్ చోరీ.. మా హయాంలోనే వేగంగా పనులు జరిగాయి..
అలాగే, వంటవాళ్లకు, డ్రైవర్లకు సూట్లు వేసి ఎంవోయిలు చేసుకున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. 2014- 19 మధ్య ఇలాంటి కథలే విన్నాం.. వాళ్ళ హయాంలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి.. మా హయాంలో ఎన్ని గ్రౌండ్ అయ్యాయో గమనిస్తే అర్ధం అవుతుంది.. 2014- 19 మధ్య వచ్చిన పెట్టుబడులు 50,708 కోట్లు, మరి మా ప్రభుత్వంలో 69,799 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మా హయాంలో వచ్చిన ఉద్యోగాలు 32,79,770 వచ్చాయి.. ఆయన హయాంలో కేవలం 9.50 లక్షల ఉద్యోగాలు మాత్రమే.. MSME సెక్టార్ లో వచ్చాయి.. ఎవరిది విధ్వంసం, ఎవరి హయాంలో పరిశ్రమలు వచ్చాయని జగన్ వెల్లడించారు.
Read Also: Bandi Sanjay: నదీ జలాల విషయంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా!
ఇక, ఇప్పటివరకు రూ. 2 వేల కోట్ల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పెండింగ్ లో ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. ఇన్సెంటివ్స్ ఇవ్వటం కోసం భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నారు.. ఇలా అయితే పరిశ్రమలు ఎలా వస్తాయి.. చంద్రబాబు పబ్లిసిటీ మాత్రం పీక్ లోనే ఉంటుంది.. పేరుకు ఒకటి, రెండు పెద్ద కంపెనీలకు భూములు ఇస్తున్నట్లు ప్రకటిస్తారు.. తన బినామీలకు కారుచౌకగా భూములు కట్టబెడతారు.. విశాఖలో 2 వేల కోట్లు విలువ చేసే 14 ఎకరాల భూమి లులు గ్రూపుకు 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారు.. ఇదే లులు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 519 కోట్లు ఖర్చు పెట్టి ఆక్షన్ లో పాడారు.. సత్వా, కపిల్, ఏఎన్ఎస్ఆర్ సహా పలు గ్రూపులకు కూడా ఏ ఆక్షన్ లు లేకుండానే భూములు ఇచ్చేశారని జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
అయితే, ఎకరా 50 కోట్లు విలువ చేసే భూములు కోటిన్నరకు ఇచ్చారని జగన్ ఆరోపించారు. రహేజాకు అయితే 99 పైసలకే ఇచ్చారు.. వీళ్లు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీటుకు ఎదురు 2 వేల రూపాయలు ప్రభుత్వం వెనక్కు ఇస్తుంది.. వీటిని ఒప్పందాలు అంటారా ఇంకేమైనా అంటారా అని ప్రశ్నించారు. ఓవైపు అప్పులు చేస్తూనే ఉంటారు.. మరోవైపు మా ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పులు తెచ్చారని అబద్ధాలు చెప్తారు.. రికార్డుల్లో ఒకటి ఉంటుంది.. ఈయన మీటింగుల్లో మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తారని జగన్ మండిపడ్డారు.
కాగా, 2019లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే వరకు ఉన్న అప్పులు 2.49 లక్షల కోట్లు.. ఇతర అన్నీ అప్పులు కలిపి 3.90 లక్షల కోట్ల అయ్యాయని జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. 2024 మార్చి వరకు 3.32 లక్షల కోట్లు.. అన్నీ అప్పులు కలిపి 7.21 లక్షల కోట్లు అప్పులు మాత్రమే ఉన్నాయి.. మేము మా ప్రభుత్వ హయాంలో 2.70 లక్షల కోట్లు డీబీటీల రూపంలో ప్రజలకు ఇచ్చాం.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 3.02 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. వచ్చే మూడు నెలల్లో 11 వేల కోట్లు అప్పులు తెచ్చుకోవడానికి ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన చంద్రబాబు సర్కార్.. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు చేసిన మేలు కూడా లేదు.. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు.