* నేడు సిద్దిపేట జిల్లాలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన.. మత్స్యకారుల సమావేశంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి
* విశాఖ: నేడు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత ఆదివాసీ సదస్సు.. హాజరుకానున్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు.
* పశ్చిమగోదావరి జిల్లా: తణుకు, అత్తిలిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..
* అనంతపురం : రెండు రోజులు పాటు జిల్లాలో పర్యటించనున్న సోమువీర్రాజు.. ఈనెల 24 న ఉరవకొండ , 25 గోరంట్లలో పర్యటన..
* అనంతపురం: జేఎన్టీయూలో రెండవరోజు కొనసాగతున్న ఎన్బీఏ బృందం పర్యటన. సివిల్ , కెమికల్ ఇంజనీరింగ్ విభాగాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలన.
* విశాఖ: నేడు ఆర్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో పథ సంచలనం.. పార్క్ హోటల్ నుంచి గోకుల్ పార్క్ వరకూ రూట్ మార్చ్
* పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి.. దీని ప్రభావంతో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. నేడు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు-విపత్తుల నిర్వహణ సంస్థ.
* తిరుమల: 24వ తేదీన ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ.. జులై, ఆగస్టు నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ.
* కడప: రేపటి నుంచి ఏపీ ఉద్యోగ సంఘం నేతృత్వంలో నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు.. ఉద్యోగుల సమస్యల పరిష్కారలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు..
* చిత్తూరు : సదుంలో వాలంటీర్ల వందనం కార్యక్రమంలో పాల్గొనునున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
* ఖమ్మం: నేడు ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి ఆత్మీయ సమావేశం.. జిల్లా చివరి ఆత్మీయ సమావేశం.. హాజరుకానున్న జూపల్లి కృష్ణ రావు, కోదండ రామ్
* నేడు ఖమ్మం లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా.. పది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రైవేట్ సంస్థలతో జిల్లా పోలీస్ శాఖ ఒప్పందం
* గుంటూరు: నేడు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం.. ఆటోనగర్‌లో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.
* గుంటూరు: నేడు పెదకాకానిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. హాజరుకానున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు.
* గుంటూరు: నేడు అరండల్ పేటలో బీసీ ఐక్యవేదిక సభ..
* రేపు బాపట్లలో పర్యటించనున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. బాపట్లలో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్..
* తూర్పుగోదావరి జిల్లా : నేటి సాయంత్రం .5.30గంటలకు రాజమండ్రిలో అంతర్జాతీయ కాండిల్ లైట్ డే ర్యాలీ.. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కంబాల చెరువు వరకు ర్యాలీ.. హెచ్ఐవి/ఎయిడ్స్ తో బాధపడి, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇటువంటి మరణాలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని అవగాహన ర్యాలీ