Champion: స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ (Champion). ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇకపోతే రిలీజ్ దగ్గర పడుతుండంతో ‘ఛాంపియన్’ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘గిర గిర గింగిరాగిరే..’ అనే పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా, మేకర్స్ ఈ సినిమా నుంచి రెండవ పాటను విడుదల చేశారు. ‘సల్లంగుండాలే..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రితేశ్, మనీషా ఆలపించారు. ఈ కొత్త పాట కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని మరో చార్ట్‌బస్టర్‌గా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25, 2025న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Toxic : కౌంట్‌డౌన్ మొదలు పెట్టిన గ్యాంగ్‌స్టర్ ‘టాక్సిక్’.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఇకపోతే ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి మరో ఆసక్తికర అంశం ఉంది. చాలా ఎక్క తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన రీఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకులలో ఈ క్యూరియాసిటీని పెంచింది. రోషన్ నటన, అనస్వర గ్లామర్, మరియు కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీతో వస్తున్న ‘ఛాంపియన్’ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి పెద్ద విజయాన్ని అందుకుంటుందో చూడాలి.