కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘KGF’ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అందుకే, ఆ సినిమా తర్వాత యశ్ నుండి రాబోతున్న ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్’ మీద కూడా అదే రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను యశ్ లాంటి మాస్ హీరోతో, వైవిధ్యమైన డైరెక్షన్ స్టైల్ ఉన్న గీతూ దాస్ డైరెక్ట్ చేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో.. స్క్రీన్ మీద యశ్ గ్యాంగ్‌స్టర్ అవతారం ఎలా ఉంటుందో అని ఆసక్తి మరింత పెరిగిపోయింది.
Also Read : Niveda Pethuraj : టాలీవుడ్‌లో మరో బ్రేక్ అప్.. ఎంగేజ్‌మెంట్ పోస్ట్ డిలీట్ చేసిని హీరోయిన్
అయితే గత కొద్దిరోజులుగా ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, వాటన్నింటికీ చెక్ పెడుతూ యశ్ టీమ్ రీసెంట్‌గా ఒక హై-వోల్టేజ్ ఇంటెన్స్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సినిమాలోని యాక్షన్, డ్రామా ఏ రేంజ్‌లో ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చింది. అలాగే, చాలా కాలంగా ఉన్న సస్పెన్స్‌కు తెరదించుతూ.. సినిమా రిలీజ్ డేట్ 2026 మార్చి 19 అని గట్టిగా కన్ఫర్మ్ చేశారు. కేవలం రిలీజ్ డేట్ మాత్రమే కాదు, ఈ గ్యాంగ్‌స్టర్ రంగంలోకి దిగడానికి ఇంకా 100 రోజులు మాత్రమే ఉందంటూ యశ్ స్వయంగా కౌంట్‌డౌన్ కూడా మొదలుపెట్టడం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.
ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌కి తగ్గట్టే.. క్యాస్టింగ్ కూడా చాలా భారీగా ఉంది. ముఖ్యంగా కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ లాంటి స్టార్ హీరోయిన్స్ కీలక పాత్రల్లో నటిస్తుండటం ప్రాజెక్ట్ రేంజ్‌ని అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమాకు ట్యూన్స్ సెట్ చేసే బాధ్యతను యంగ్ మ్యూజిక్ స్టార్ అనిరుధ్ రవిచందర్‌కి అప్పగించారు. యశ్, అనిరుధ్ కాంబినేషన్ అంటే సౌండ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్.. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలవబోతోంది. మొత్తానికి, కౌంట్‌డౌన్ స్టార్ట్ అవ్వడంతో.. ‘టాక్సిక్’ హంగామా ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.