Hyderabad: గోషామహల్లో మరోసారి కుంగిన చాక్నావాడి నాళా..
- గోషామహల్లో మరోసారి కుంగిన చాక్నావాడి నాళా
- అర్ధరాత్రి కావడంతో తప్పిన పెను ప్రమాదం
- దారుసల్లాం నుండి చాక్నావాడి వెళ్లే దారి మధ్యలో కుంగిన సివరేజి నాళా
- ఇప్పటికే గతంలో రెండు సార్లు కుంగిన నాళా
- గతంలో కుంగిన నాళా నిర్మాణ పనులకు కోసం వచ్చిన రీడిమిక్స్ లారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోషామహల్లో చాక్నావాడి నాళా మరోసారి కుంగింది. కుంగిన సమయం అర్ధరాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. దారుసల్లాం నుండి చాక్నావాడి వెళ్లే దారి మధ్యలో సివరేజి నాళా కుంగిపోయింది. ఇప్పటికే గతంలో రెండు సార్లు ఈ నాళా కుంగింది. గతంలో కుంగిన నాళా నిర్మాణ పనులకు కోసమని రీడిమిక్స్ లారీ అక్కడకు వచ్చింది. అయితే.. నాళాపై నుండి లారీ వెళ్లడంతో మరోసారి నాళా కుంగింది. దీంతో.. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కాగా.. నిత్యం నాళాలు కుంగడంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. దారుసల్లాం చౌరస్తా నుంచి చాక్నావాడా మీదుగా గోషామహల్ పోలీస్ గ్రౌండ్ వరకు సివరేజ్ నాళా ఉంది. సుమారు కిలో మీటర్ పైగా అండర్ గ్రౌండ్ సివరేజ్ నాళా ఉంది. పురాతన నాళా కావడంతో తరచూ కుంగిపోతుంది.
Read Also: Bandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ వదిలిపెట్టదు.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్
Also Read
గత ప్రభుత్వ హయాంలో కూడా చాక్నావాడిలో ఉన్న నాళా కూలింది. దీంతో అప్పటి ప్రభుత్వం మంత్రులు అధికారులు సందర్శించి నాలా పనులు పూర్తి చేశారు. అయితే.. కొన్ని రోజుల క్రితమే చాక్నావాడిలో మళ్లీ నాలా కుంగింది. ఈ క్రమంలో.. ఆ నాళాను అధికారులు మరమ్మతులు చేసేందుకు పనులు ప్రారంభించారు. అయితే.. పనులు జరుగుతున్న సమయంలో దారుసలాం రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో మరోసారి నాలా గురువారం అర్ధరాత్రి కుంగింది.
Read Also: Vishal : హీరో విశాల్ హెల్త్ కండీషన్ పై స్పందించిన స్టార్ హీరో..ఏమన్నారంటే ?
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్కు సారీ.. కాంగ్రెస్కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!