గోషామహల్లో చాక్నావాడి నాళా మరోసారి కుంగింది. కుంగిన సమయం అర్ధరాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. దారుసల్లాం నుండి చాక్నావాడి వెళ్లే దారి మధ్యలో సివరేజి నాళా కుంగిపోయింది. ఇప్పటికే గతంలో రెండు సార్లు ఈ నాళా కుంగింది. గతంలో కుంగిన నాళా నిర్మాణ పనులకు కోసమని రీడిమిక్స్ లారీ అక్కడకు వచ్చింది.