టాలివుడ్ హాట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా మరోవైపు సోషల్ మీడియాలో హీటెక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. తాజాగా తాను ఓ సమస్య తో భాధపడుతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.. అది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
ఇక టాలీవుడ్ లో దూసుకుపోతోంది హీరోయిన్ మృణల్ ఠాకూర్.. సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహారిస్తుంది.. మంచి సినిమాలు ఎంచుకుని చేస్తోంది. ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్లు అందుకుంటుంది.. బాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లు తీసుకుంటుంది మృణాలు.. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో నటిస్తోన్న మృణాలు.. ఈసినిమాతో పాటు విజయ్ దేవరకొండ జోడీగా మరోసినిమా చేస్తోంది..
తాజాగా మృణాల్‌ఠాకూర్‌కు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.. మృణాల్ ఠాకూర్ రేచీకటితో బాధపడుతున్నదట. ఆ విషయాన్ని దాచేసి.. పెళ్ళి కోసం వరుడిని వెతికేపనిలో ఉన్నారంట ఆమె కుటుంబసభ్యులు. ఈ న్యూస్ విని అంతా షాక్ అవుతున్నారు. మీరు కూడా షాక్ అయ్యి ఉంటారు కదా.. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో కూడా స్వయంగా ఆమెనే వెళ్ళడించారు.. నిజానికి ఈ అమ్మడు బాలీవుడ్‌లో ఆంఖ్ మిచోలీ అనే సినిమా చేస్తుంది. అందులో మృణాల్‌కి రేచీకటి. ఆ విషయాన్ని దాచి వరుడుకోసం వెతుకుతుంటారు ఆమె కుటుంబసభ్యులు..
ఇక సౌత్ టు నార్త్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.. తెలుగులో ప్రస్తుతం Nani30, విజయ్ దేవరకొండ సరసన VD13లో నటిస్తోంది. అలాగే తమిళ స్టార్ శివ కార్తీకేయ అప్ కమింగ్ సినిమాతో కోలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.. రేచీకటి ఉన్న అమ్మాయి పాత్రలో తాను నటిస్తున్నట్టు అసలు విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది మృణాల్. ఈ తరహా పాత్ర చేయడం తనకు ఇదే మొదటి సారి అని అంటోంది. నటిగా తనకిది ఓ ఛాలెంజ్ లాంటిదని మృణాల్ చెప్తుంది.. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే.. ఇక టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా మారడం ఖాయం అంటున్నారు సినీ ప్రముఖులు..