రాజన్న సిరిసిల్లలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సీపీఐ పార్టీ కార్మిక భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతుందని.. జమిలి ఎన్నికలు అసాధ్యం అని అన్నారు.
Chada Venkata Reddy: ఫిరాయింపులతో రాజకీయ వ్యవస్థ బూజు పడుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. కేసిఆర్ పంటలు ఎండిపోతున్నాయి అని ముమ్మాటికీ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చి బీఆర్ఎస్ ను గెలిపించేలా బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని అర్థమవుతోందని ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఎజెండాను అమలు చేస్తాయన్నారు.