సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల విధానం అనేది దేశంలో పాత విధానమే, దీనిపై ప్రధాని మోడీ కమిటీని వేస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం అనడం సరికాదన్నారు. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం అనేది తలకిందులుగా తపస్సు చేసిన వీలుగాని అంశమని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక అన్న మోడీ పెట్రోల్ ఉత్పత్తులను పక్కదారి పట్టిస్తూ జీఎస్టీని అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు.
Also Read : Amit Shah: ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోంది.. సీఎం కొడుకు వ్యాఖ్యలపై ఫైర్..
దేశంలో 28 పార్టీలు బీజేపీ హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో ముందుకు పోతున్నాయని, పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏది చెప్పామో అదే కాంగ్రెస్ పార్టీకి చెప్పామన్నారు చాడ వెంకట్ రెడ్డి. పొత్తులో భాగంగా మేము అడిగిన ఐదు సీట్లు ఇవ్వకపోతే, రాష్ట్రవ్యాప్తంగా బలంగా ఉన్న 33 నియోజకవర్గాల్లో సీపీఐ పార్టీ అభ్యర్థులను నిలబెడతామని ఆయన వెల్లడించారు.
Also Read : Daggubati Purandeswari: అధికార పార్టీపై పురందేశ్వరి ఫైర్.. అప్పుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్