ప్రస్తుత రోజుల్లో ఇంటికో టూవీలర్ కామన్ అయిపోయింది. వివిధ అవసరాల కోసం బైకులను యూజ్ చేస్తున్నారు. అయితే వాహనదారులు తరచుగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ద్విచక్ర వాహనాల్లో కొత్త సేఫ్టీ ఫీచర్ ను తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి దేశంలో విక్రయించే అన్ని టూవీలర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తప్పనిసరి చేయాలని యోచిస్తు్న్నట్లు సమాచారం.
Also Read:Ahmedabad Plane Crash: భారీగా దెబ్బతిన్న బ్లాక్ బాక్స్! డేటా సేకరించడం కష్టమే! జాతీయ మీడియా కథనాలు
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయబోతోందని వెల్లడించింది. దీని ప్రకారం, జనవరి 2026 నుంచి, దేశంలో తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాలలో, అది బైకులు లేదా స్కూటర్లు అయినా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ను అందించడం తప్పనిసరి అవుతుంది. ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా ద్విచక్ర వాహనాలలో ABS తప్పనిసరి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
Also Read:Upendra Kushwaha: నాకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరణభయం ఉంది.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
ABS లేదా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక భద్రతా లక్షణం. ఇది బైక్ (లేదా ఏదైనా వాహనం) బ్రేకింగ్ చేసేటప్పుడు టైర్లు లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది. దీని ప్రధాన విధి ఏమిటంటే, అత్యవసర పరిస్థితిలో డ్రైవర్ అకస్మాత్తుగా హార్డ్ బ్రేక్ వేసినప్పుడు, టైర్లు జారిపోకుండా, బైక్ సమతుల్యంగా ఉండటానికి దోహదపడుతుంది. ఒక వాహనం ఎదురుగా వచ్చినప్పుడు లేదా రోడ్డు బాగాలేనప్పుడు వాహనదారులు తరచుగా సడన్ బ్రేకులు వేస్తారు. అటువంటి పరిస్థితిలో, టైర్లు లాక్ చేయబడితే (అంటే తిరగడం ఆగిపోతే), బైక్ స్కిడ్ అయి ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించడానికి ABS పనిచేస్తుంది.
ABS ఎలా పని చేస్తుంది?
ABS టైర్ల వేగాన్ని నిరంతరం పర్యవేక్షించే కొన్ని సెన్సార్లు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు (ECU) తో అమర్చబడి ఉంటుంది.
మీరు బ్రేక్ వేసేటప్పుడు, సెన్సార్లు టైర్ వేగాన్ని పర్యవేక్షిస్తాయి.
ఒక టైర్ అకస్మాత్తుగా లాక్ అవ్వడం ప్రారంభిస్తే, ABS ఆ టైర్‌పై బ్రేక్ ఒత్తిడిని కొంతకాలం తగ్గిస్తుంది.
టైర్లు జారిపోకుండా ఉండటానికి ఈ ప్రక్రియ ప్రతి సెకనుకు చాలాసార్లు జరుగుతుంది.
దీనివల్ల బైక్ జారిపోకుండా ఉంటుంది. బ్రేకులు సడన్ గా అప్లై చేసినా రైడర్ నియంత్రణలో ఉంటాడు.
Also Read:Ahmedabad Plane Crash: భారీగా దెబ్బతిన్న బ్లాక్ బాక్స్! డేటా సేకరించడం కష్టమే! జాతీయ మీడియా కథనాలు
ఎన్ని రకాల ABSలు ఉన్నాయి?
సింగిల్ ఛానల్ ABS: ముందు చక్రంలో మాత్రమే పనిచేస్తుంది.
డ్యూయల్ ఛానల్ ABS: ముందు, వెనుక చక్రాలు రెండింటిలోనూ పనిచేస్తుంది.
ABS కి సంబంధించి కొత్త రూల్
ప్రస్తుతం, 125 సిసి కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలలో మాత్రమే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తప్పనిసరిగా అందిస్తున్నారు. అందువల్ల, దేశంలో అమ్ముడవుతున్న దాదాపు 45% బైక్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. ఎందుకంటే భారతీయ మార్కెట్‌లో 125 సిసి కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కమ్యూటర్ సెగ్మెంట్ బైక్‌లను కొనుగోలు చేసే వారే ఎక్కువ. ఇందులో హీరో స్ప్లెండర్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్, స్టార్, బజాజ్ ప్లాటినా వంటి మోడళ్లు ఉన్నాయి. కొత్త నోటిఫికేషన్‌తో, ఈ ఫీచర్ అన్ని కొత్త బైక్‌లకు వర్తిస్తుంది. దాదాపు అన్ని వాహనాలు గంటకు 70 కి.మీ వేగంతో దూసుకెళ్తాయి కాబట్టి, ప్రమాదాల అవకాశాలను తగ్గించడానికి ఈ ఫీచర్ చాలా ముఖ్యమైనదని భావిస్తున్నారు. ABS కి సంబంధించిన నియమాల నోటిఫికేషన్ రాబోయే కొన్ని నెలల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.