Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్.. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
- కొత్త పెన్షన్ పథకానికి ఆమోదం
- సర్వీస్‌లో పాతికేళ్లు పూర్తయినవారికి పూర్తి పెన్షన్
- బయో ఈ-3 విధానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- 11.. 12 తరగతి విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కు ఆమోదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగుల్లో పాత పెన్షన్ స్కీమ్ (OPS) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పని చేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ పథకం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనుంది.
Satyabhama: వరంగల్‌లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
కేబినెట్ సమావేశానికి సంబంధించిన సమాచారంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. పదేళ్లు సర్వీస్ చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుందని తెలిపారు.అలాగే ఉద్యోగులు సర్వీసులో ఉండగా చనిపోతే వారి భార్యలకు 60 శాతం పెన్షన్ ఇస్తారని పేర్కొన్నారు. ఎన్‌పిఎస్ పథకాన్ని మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని అన్నారు. 2023 ఏప్రిల్‌లో ప్రధాని మోడీ ఈ సంస్కరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీకి డాక్టర్ సోమనాథన్ అధ్యక్షుడిగా ఉన్నారని.. ఈ కమిటీ 100కు పైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతో మాట్లాడిందని తెలిపారు. ఈ కమిటీ దాదాపు అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపిందని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఈ అంశాన్ని ప్రధాని సీరియస్‌గా తీసుకుని.. కమిటీ సిఫార్సు మేరకు సమీకృత పింఛను పథకాన్ని ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు.
Andhra Pradesh: భారత్ నెట్ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు
అలాగే.. బయో ఈ-3 విధానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ‘ఈ-3 అంటే ఎకానమీ, ఎన్విరాన్ మెంట్, ఎంప్లాయిమెంట్. ఐటీ, ఇండస్ట్రియల్ మాదిరి త్వరలో బయో విప్లవం రానుంది. భవిష్యత్ లో బయో టెక్నాలజీ, బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయి’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతేకాకుండా.. 11, 12 తరగతి విద్యార్థుల ఇంటర్న్‌షిప్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కీమ్ ‘విజ్ఞాన్ ధార’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!