Universal Pension Scheme: భారతీయులందరి కోసం కేంద్ర కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసంఘటి రంగంలోని వారితో సహా అందరు పౌరులకు అందుబాటులో ఉండేలా ‘‘యూనివర్సల్ పెన్షన్ స్కీమ్’’పై ప్రభుత్వం దృష్టి సారించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిర్మాణ కార్మికులు, గృహ సిబ్బంది, గిగ్ వర్కర్లు వంటి అసంఘటిత రంగంలోని వారికి ప్రభుత్వం నిర్వహించే పెద్ద పొదుపు పథకాలు అందుబాటులో లేవు.
ప్రభుత్వ ఉద్యోగుల్లో పాత పెన్షన్ స్కీమ్ (OPS) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)కి బదులుగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పని చేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఈపీఎఫ్‌వో… కనీస పింఛను పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి కార్మిక సంఘాలు.. ఈ నేపథ్యంలో కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వేస్తున్నట్టుగా సమాచారం.. ఉద్యోగులకు మెరుగైన స్థిర పెన్షన్ అందించే విధంగా కొత్త ఫిక్సిడ్ పెన్షన్ స్కీమ్‌ను తీసుకురావడానికి సిద్ధం అవుతోంది ఈపీఎఫ్‌వో.. దీని ప్రకారం.. ఫిక్సిడ్ పెన్షన్ మొత్తాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉద్యోగికి ఇవ్వనున్నారు.. ఇక, ఈ పథాన్ని స్వయం ఉపాధి పొందే…