NTV Telugu Site icon

Siddipet: సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై కేసులు

Plexi War,

Plexi War,

సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీ చింపివేశారని బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్, వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.. పోలీసులు. ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి కాన్వాయ్ తో బయలుదేరారు.

READ MORE: Shiva Raj Kumar: తమిళ దర్శకుడితో శివ రాజ్ కుమార్ సినిమా

కాగా.. రుణమాఫీ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నినాదాలతో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేసిందని.. హామీ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్‌ఎస్‌ నాయకులను అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫ్లెక్సీల చింపివేశారు. ఈ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫ్లెక్సీల చింపివేతపై హరీష్ రావు ట్వీట్ చేశారు. మాజీ మంత్రిపైనే దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

READ MORE: Samantha: దర్శకుడు రాజ్‌తో ప్రేమ ప్రచారం.. ముంబైలో అలా కనిపించిన సమంత!

సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. వెంటనే ఈ ఘటనపై @TelanganaDGP గారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.