Siddipet: సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై కేసులు
- సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ నాయకులపై కేసులు
- పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నాయకులపై కేసు
- ఫ్లెక్సీ చింపివేశారని కాంగ్రెస్ నాయకులపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీ చింపివేశారని బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్, వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.. పోలీసులు. ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి కాన్వాయ్ తో బయలుదేరారు.
READ MORE: Shiva Raj Kumar: తమిళ దర్శకుడితో శివ రాజ్ కుమార్ సినిమా
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
కాగా.. రుణమాఫీ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నినాదాలతో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేసిందని.. హామీ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్‌ఎస్ నాయకులను అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫ్లెక్సీల చింపివేశారు. ఈ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫ్లెక్సీల చింపివేతపై హరీష్ రావు ట్వీట్ చేశారు. మాజీ మంత్రిపైనే దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
READ MORE: Samantha: దర్శకుడు రాజ్‌తో ప్రేమ ప్రచారం.. ముంబైలో అలా కనిపించిన సమంత!
సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. వెంటనే ఈ ఘటనపై @TelanganaDGP గారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.
తాజావార్తలు
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!