JP Nadda: దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య.. కేంద్రమంత్రి ఏమన్నారంటే..?
- దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి- ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా
- క్యాన్సర్ రోగులకు ధర.. చికిత్స అందుబాటులో ఉండేలా..
- ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది- నడ్డా
- లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా
- ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య 2.5 శాతం చొప్పున పెరుగుతోంది
- ఏటా 15.5 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి- జేపీ నడ్డా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. క్యాన్సర్ రోగులకు ధర.. చికిత్స అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. శుక్రవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన.. ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య 2.5 శాతం చొప్పున పెరుగుతోందన్నారు. పురుషులలో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఎక్కువ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. ఏటా 15.5 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని జేపీ నడ్డా తెలిపారు.
Stock market: సరికొత్త రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అయితే క్యాన్సర్ కోసం వినియోగించే మందుల ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నదని జేపీ నడ్డా తెలిపారు. ప్రభుత్వం విధించిన ధరల పరిమితి కారణంగా రోగులకు దాదాపు రూ.294 కోట్లు ఆదా అవుతుందన్నారు. 28 కాంబినేషన్లు ఈ జాబితాలో లేవని, అయితే NPPA (నేషనల్ డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ) మరియు ప్రభుత్వం వాటి ధరలను కూడా నియంత్రించాయని జేపీ నడ్డా చెప్పారు. తమ ప్రభుత్వం క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకురావడానికి మరింతగా ప్రయత్నిస్తుందని చెప్పారు.
Jagga Reddy: హైదరాబాద్‌కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా..?
హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సభ్యలు అడిగిన ప్రశ్నకు నడ్డా స్పందిస్తూ.. ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని, ఎక్కువ మంది వైద్యులు ఉండేలా మెడికల్ కాలేజీల విస్తరణ జరుగుతోందని జేపీ నడ్డా పేర్కొన్నారు. 2014లో మెడికల్ కాలేజీల సంఖ్య 387 ఉండగా ప్రస్తుతం 731కి పెరిగిందని తెలిపారు. అదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 సీట్ల నుంచి 1,12,112 (1.12 లక్షలు)కి పెరిగిందని నడ్డా సభకు తెలియజేశారు. వైద్య విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 2014లో 31,185 ఉండగా ప్రస్తుతం 72,627కు పెరిగాయని నడ్డా తెలిపారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!