ప్రతిరోజు ఉదయం అల్పాహారం తప్పనిసరిగా చేయాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. అయితే మీరెప్పుడైనా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి విన్నారా? దీనినే బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు. ఈ కాఫీని అల్పాహారానికి ఒక ప్రత్యామ్నాయంగా చెప్తారు. అంటే ఈ కాఫీ తీసుకుంటే అల్పాహారం చేసేసినట్లే.