ఈ నెల 28న నల్గొండలో బీఆర్ఎస్ (BRS) రైతు మహా ధర్నా నిర్వహించనుంది. అయితే.. ఈ నెల 21న నల్గొండలో రైతు మహా ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునివ్వగా.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్‌ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ)న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఈరోజు.. ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.
మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా 430 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఈనెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించినట్లు ఈటల తెలిపారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న రైల్వేస్టేషన్ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి.. నగర వాసులకు జన ఒత్తిడి లేకుండా ఉంటుందని అన్నారు.
ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందుకు సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడారు. ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.