ఎన్ని కఠిన చట్టాలొచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. కఠిన శిక్షలు పడుతున్నా కూడా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇంట్లో రిపేర్ పని కోసం వచ్చిన ఓ యువకుడు వంకర బుద్ధి ప్రదర్శించాడు. ఒంటరిగా ఉన్న వివాహిత మహిళపై దుర్బుద్ధి పుట్టింది. బెడ్‌రూమ్‌లో ఉన్న మహిళపై అఘాయిత్యానికి పూనుకున్నాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: KTR: మళ్ళీ కేసీఆర్ను సీఎంను చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం..
ఉత్తర బెంగళూరులో సాఫ్ట్‌వేర్ మాజీ మహిళ ఉద్యోగి నివాసం ఉంటుంది. భర్త డ్యూటీలో ఉండగా.. బిడ్డతో మహిళ ఇంట్లో ఉంది. అయితే ఇంటర్నెట్‌లో సమస్య తలెత్తడంతో ఆన్‌లైన్‌లో మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఓ యువకుడు రిపేర్ చేసేందుకు వచ్చాడు. రౌటర్‌ను పరిశీలించగా వైర్ తెగిపోవడంతో సమస్య వచ్చినట్లుగా చెప్పాడు. కొద్దిసేపు బయటకు వెళ్లి లోపలికి వచ్చి సమస్య పరిష్కరిస్తానని తెలిపాడు. అనంతరం పని పూర్తైందని.. ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాడు. మహిళ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చెక్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చి కౌగిలించుకున్నాడు. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురైంది. లైంగిక దాడికి యత్నించగా చెంపదెబ్బలు కొట్టింది. వెంటనే కేకలు వేసి ఇరుగుపొరుగు వారిని అలర్ట్ చేసింది. భయంతో వెంటనే నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు.
ఇది కూడా చదవండి: Manipur: బీజేపీకి షాక్ ఇచ్చిన సీఎం నితీష్ కుమార్.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..
బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసి నిందితుడు హరీశ్ బాబు(25)ను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. గత ఆరు నెలలుగా ఆమె ఇంటికి పలుమార్లు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 75(1)(i)(ii) కింద అభియోగం మోపారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళ ప్రదర్శించిన ధైర్యాన్ని, ఆలోచనను అధికారులు ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Stock Market: నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్