జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఆయన కుమారుడు చర్లకోల స్వరణ్ పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష్మారెడ్డికి అండగా ఉండి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు.
నేడు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమార్తె స్ఫూర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు.
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలంలోని వనమొనిగూడతండా, నామ్యతండా, బిల్డింగ్ తండా, హేమాజిపూర్, తిమ్మారెడ్డిపల్లి, నేలబండతండా, పొలిమేరబండతండా తదితర గ్రామాల్లో లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు.